: జువైనల్ జస్టిస్ బిల్లును ఆమోదించరాదు: రామ్ జెఠ్మలానీ
జువైనల్ జస్టిస్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదించరాదని ప్రఖ్యాత న్యాయవాది, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి రామ్ జెఠ్మలానీ అన్నారు. ఏదో ఒక ఘటన జరిగిందన్న నెపంతో, చట్టాన్ని మార్చాలనుకోవడం సరికాదని తెలిపారు. జువైనల్ చట్టంలో మార్పులు చేయడం ద్వారా ఉపయోగం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం పటిష్టంగానే ఉందని చెప్పారు. మరోవైపు జువైనల్ బిల్లును పాస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఉన్నాయి. సీపీఐఎం మాత్రం బిల్లును వ్యతిరేకిస్తోంది.