: రోజా అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం... ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసే యోచన


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే అనితపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఇవాళ ఆ వ్యాఖ్యలపై సభలో మాట్లాడిన మహిళా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సభలో మహిళలకు న్యాయం చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రోజా వ్యాఖ్యల అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని సిఫార్సు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల కారణంగా, రోజాను ఇప్పటికే అసెంబ్లీ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News