: రోజా సస్పెన్షన్ తగ్గించాలన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా: విష్ణు కుమార్ రాజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సంవత్సరం పాటు విధించిన సస్పెన్షన్ తగ్గించాలంటూ కొన్నిరోజుల కిందట తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తెలియక మొదట తగ్గించాలని కోరానని, అసెంబ్లీ రికార్డులు చూశాక రోజాపై చర్యలు సమంజసమేనని సమర్థిస్తున్నానని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ శాసనసభలో ఇవాళ చర్చ సందర్భంగా ఆయన పైవిధంగా స్పందించారు.