: యూఏఈలో తలపడనున్న గంగూలీ, సెహ్వాగ్ జట్లు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా అమెరికాలో జరిగిన ఆల్ స్టార్స్ క్రికెట్ లీగ్ తరహాలో మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) త్వరలోనే సందడి చేయనుంది. ఎమిరేట్స్ బోర్డ్-ఎంసీఎల్ మధ్య పదేళ్ల ఒప్పందంలో భాగంగా, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్న 18 మ్యాచ్ లలో ఆరు జట్లు సందడి చేయనున్నాయి. లిబ్రా లెజెండ్స్, జెమినీ అరేబియన్స్, కాప్రికోర్న్ కమాండర్స్, లియో లైట్స్, విర్గో సూపర్ కింగ్స్, సాగిటారియస్ స్ట్రయికర్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో గంగూలీకి చెందిన లిబ్రా లెజెండ్స్ తో సెహ్వాగ్ కి చెందిన జెమినీ అరేబియన్స్ తలపడనుంది.