: అయోధ్యలో ఏం జరుగుతోందో రహస్య నివేదిక ఇవ్వండి: యూపీ ప్రభుత్వం
ఆయోధ్యలో ఏం జరుగుతోందో రహస్య నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ శాఖను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఇటుకలు సేకరించాలని వీహెచ్పీ పిలుపునిచ్చిన ఆరు నెలల తరువాత రెండు ట్రక్కులతో ఇటుకలు అయోధ్య చేరుకున్నాయి. ఈ నేపథ్యలో అక్కడ ఏం జరుగుతోందో తెలిపాలని ఇంటెలిజెన్స్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయోధ్య సమీపంలోని రామసేవక్ పురంలో వీహెచ్పీ స్థలంలో దించిన ఇటుకలకు రామజన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ శిలాపూజ నిర్వహించినట్టు వీహెచ్పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ ప్రకటించిన తెలిసిందే. ఈ సందర్భంగా నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ నుంచి అనుమతి లభించినట్టు వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది? వంటి వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం ఆరాతీస్తోంది.