: త్వరలో మార్కెట్ లోకి మ్యాగీ కొత్త రుచులు


ఇప్పుడిప్పుడే నిషేధం నుంచి కోలుకుంటున్న మ్యాగీ నూడుల్స్ వినియోగదారులకు మరిన్ని రుచులను అందించబోతున్నాయి. ఈ నూడుల్స్ లో మరికొన్ని కొత్త వెరైటీలను వచ్చే మూడు, నాలుగు నెలల్లో మార్కెట్ లోకి విడుదల చేయనున్నామని నెస్లే ఇండియా ప్రకటించింది. అందులో ఓట్స్ నూడుల్స్, కప్ నూడుల్స్, ఆటా నూడుల్స్ లాంటి కొత్త రకాల్ని ప్రవేశపెడుతున్నామని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో మ్యాగీ నూడుల్స్ కు చెన్నై, మైసూర్ ల్యాబొరేటరీల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో కొత్త రకాలను ప్రవేశపెడుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News