: సాయంత్రం ఆరున్నరకు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చిన రాష్ట్రపతి
హైదరాబాద్ లో శీతాకాల విడిది నిమిత్తం వచ్చి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీని ఈ సాయంత్రం ఆరున్నరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలవనున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడికి ప్రణబ్ అపాయింట్ మెంట్ ఖరారైనట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ మధ్యాహ్నం ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రణబ్ ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విభజన తరువాత ఏర్పడిన సమస్యలపై వివరణ ఇచ్చారు. కృష్ణా జలాలపై నెలకొన్న వివాదం గురించి కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో సాయంత్రం చంద్రబాబు సైతం రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్లనుండటం గమనార్హం.