: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ఘటనలో ఆలయంలోని చలువ పందిళ్లు దగ్ధమయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై మంటలను ఆర్పి వేయించారు. నేడు ముక్కోటి ఏకాదశి కావడంతో భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ ప్రమాదంతో కొద్దిపాటి ఆందోళనకు గురయ్యారు.