: ముదిరిన ఢిల్లీ యుద్ధం... జైట్లీపై ఆప్ పోలీస్ కంప్లెయింట్


దేశ రాజధానిలో రాజకీయ యుద్ధం మరోమారు తార స్థాయికి చేరుకుంది. తనపైనే కాక తన కుటుంబ సభ్యులపైనా ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆరుగురు ఆప్ నేతలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేటి ఉదయం రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇక తామేమీ తక్కువ తినలేదన్నట్లు కేజ్రీ పార్టీ ఆప్ కూడా ఆరుణ్ జైట్లీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడి హోదాలో అరుణ్ జైట్లీ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఆ ఫిర్యాదులో డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ఆరోపణలపై మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణియన్ తో విచారణ చేయించాలని కూడా కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరుతున్నట్లేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News