: సంచలనం సృష్టిస్తున్న 'ఐఎస్ఐఎస్ దుశ్శాసనుల' వీడియో!
ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలను కళ్లకు కట్టేలా చూపే మరో వీడియో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. యాజిడి కార్యకర్తలు అప్ లోడ్ చేయగా 'మెయిల్ ఆన్ లైన్ వీడియో' విభాగంలో ఉన్న ఈ వీడియోలో తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్న దారుణం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో తాము బంధించి తెచ్చిన కుటుంబాల నుంచి మహిళలు, యువతులను వేరు చేసేందుకు ఉగ్రవాదులు దుశ్శాసనులుగా మారారు. ఒక్కొక్కరి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వేరు చేశారు. బాలికల తండ్రుల ఆర్తనాదాలు మిన్నంటుతుండగా, ఒక్కొక్కరినీ వేరు చేశారు. ఇరాక్ లో ఐఎస్ఐఎస్ దుర్మార్గాలు మితిమీరినప్పటి నుంచి యాజిడి వర్గం మహిళలకు కంటి మీద నిద్ర లేకుండాపోయింది. ఇప్పటికే ఎన్నో వేల మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. (చూసిన వారి మనసుకు బాధ కలుగుతుందన్న భావన తోనే వీడియోను చూపించడం లేదు)