: రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరే పద్ధతి ఇది కాదు: స్పీకర్ కోడెల


ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన వైకాపా ఎమ్మెల్యే రోజా విషయమై ఈ ఉదయం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరుగగా, స్పీకర్ కల్పించుకున్నారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయమని వైకాపా కోరుతున్న పద్ధతి సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "తప్పు జరిగింది, మరోసారి ఇలా జరగనివ్వబోము. సస్పెన్షన్ ఎత్తివేయండని కోరితే పరిస్థితి మరోలా ఉండేది. అలా చేయకుండా, సభ తప్పు చేసింది. తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించడం సరికాదు" అన్నారు. అంతకుముందు రోజాపై ఎట్టి పరిస్థితుల్లోను సస్పెన్షన్ తొలగించే పరిస్థితే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News