: ‘డిక్టేటర్’ ఆడియో లాంచ్ ప్రారంభం
ప్రముఖ హీరో బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్ ఆడియో లాంచ్ వేడుక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రారంభమైంది. ప్రముఖ యాంకర్ సుమ ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘తెలుగు సినిమా చరిత్రలో.. తెలుగు సినిమా పాటల చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పాటల పండగ’ అంటూ సుమ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఒక నృత్య కార్యక్రమాన్ని ప్రదర్శించారు. కాగా, అన్ని జిల్లాల్లో నుంచి బాలకృష్ణ అభిమానులు ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి తరలివచ్చారు.