: ‘కోట’ చుట్టూ చేరిన యువ హాస్యనటులు!


తనదైన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుతో యువ హాస్య నటులు ముచ్చటించారు. వీరికీ అవకాశం 'సిద్ధార్థ' సినిమా షూటింగ్ సెట్స్ లో లభించింది. ఈ విషయాన్ని, ఇందుకు సంబంధించి దిగిన ఒక సెల్ఫీని యువ హాస్య నటుడు తాగుబోతు రమేశ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. షూటింగ్ సమయంలో దొరికిన కొంత గ్యాప్ లో యువ హాస్య నటులమందరమూ లెజెండరీ యాక్టర్ ‘కోట’ చుట్టూ చేరామని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News