: ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి బాంబు బెదిరింపు!
ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కెన్యా లోని మొంబాసాలో అత్యవసరంగా దింపివేశారు. మారిషస్ నుంచి పారిస్ వెళుతున్న బోయింగ్ 777 ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో టాయిలెట్లలో అనుమానాస్పద పరికరం కనిపించింది. దీనిని బాంబుగా అనుమానించిన పైలట్లు అంతర్జాతీయ విమానాశ్రయం మొంబాసాలో దించేందుకు ఎయిర్ పోర్ట్ అధికారులను అనుమతి కోరారు. దీనికి అధికారులు అంగీకరించడంతో విమానాన్ని అత్యవసరంగా దింపినట్లు పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి 12.37 గంటల సమయంలో విమానం అత్యవసరంగా దిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికుంలందరిని సురక్షితంగా కిందకు దింపినట్లు చెప్పారు. బాంబుగా అనుమానిస్తున్న ఈ పరికరాన్ని బాంబు స్క్వాడ్ బృందాలు పరీక్షిస్తున్నాయి.