: తదుపరి వంతు రాజీవ్ హంతకులదేనా?
కసబ్ ... అఫ్జల్ గురు ... తర్వాత వంతు ఎవరిది?
ఇప్పుడు
దేశవ్యాప్తంగా అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న ఇదే. దీనికి సమాధానం కూడా
వారి వద్దే వుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష పడి,
రోజులు లెక్కబెడుతున్న ముగ్గురు దోషులే తర్వాతి టార్గెట్ అన్నది అందరూ
ఊహించదగినదే. అది ఆ ముగ్గురు దోషులకూ కూడా తెలుసు. అందుకే, నిన్న అఫ్జల్
ఉరి తీత విషయం వెలుగులోకి రాగానే రాజీవ్ హంతకుల బంధువులు ఆశలు
వదిలేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడుతూ, దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న దోషులను క్షమించరాదన్నది కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయంలా కనిపిస్తోంది. అందుకే, మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఉగ్రవాది కసబ్, తర్వాత మరో ఉగ్రవాది అఫ్జల్ గురులకు ఉరిశిక్షలను ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసులో ముగ్గురు నిందితులను కూడా ఇదే విధంగా శిక్షించే అవకాశం ఉందని ప్రముఖ న్యాయవాదులు కూడా అంటున్నారు.

ఇలాంటి కేసుల్లో రాష్ట్రపతి క్షమాభిక్ష
తిరస్కరించిన వెంటనే చడీ చప్పుడూ లేకుండా పని కానిచ్చేయాలన్నది ప్రభుత్వ
ఉద్దేశంలా వుంది. ఎందుకంటే, రాష్ట్రపతి తిరస్కరణ విషయం వెలుగులోకి వస్తే
కనుక, దోషులతో బాటు మానవహక్కుల సంఘాలు కూడా మళ్ళీ ఏదో ఒక వంక చూపిస్తూ
కోర్టులను ఆశ్రయించే అవకాశం వుంది. దాంతో, మళ్ళీ అక్కడ కాలాతీతం అవుతుంది.
దీనిని దృష్టిలో పెట్టుకునే, కసబ్, అఫ్జల్ విషయాల్లో ప్రభుత్వం వేగంగా
స్పందించి, మరణశిక్షలను అమలు చేసేసింది. ఇదే సూత్రాన్ని రాజీవ్ హంతకులకు
కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అఫ్జల్ మరణశిక్ష అమలును నిలువరించడానికి జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చాలా ప్రయత్నాలు చేశారట. ఈ విషయంలో ఆయన ఆమధ్య బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయినప్పటికీ, కేంద్రం ఆ విషయంలో కఠినంగానే వ్యవహరించింది. అఫ్జల్ ఉరి తీత సమాచారాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు కేవలం 12 గంటల ముందు మాత్రమే అందించింది. అది కూడా కాశ్మీర్ లోయలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా చూడడం కోసం!
అలాగే, రాజీవ్ హంతకుల విషయంలో కూడా తమిళనాడు రాజకీయ నాయకులు ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా, మరణశిక్షను అమలు చేసే దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాజీవ్ హత్య కేసు నిందితులు రాష్ట్రపతి తమ క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించడంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేశారు. త్వరలోనే ఈ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ముందు తుది విచారణకు రానున్నాయి. వీరి అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉరి తీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం తమిళనాడులోని వెల్లూరు జైలులో ఆశ... నిరాశల మధ్య రోజులు వెళ్ళదీస్తున్న రాజీవ్ గాంధీ హంతకులు మురుగన్, పెరారివలన్, సంతన్ .... ముగ్గురూ ఇప్పుడు అఫ్జల్ జీవితం ముగింపు లానే తమ జీవితాలు కూడా ముగుస్తాయా? అన్న సందేహంలో వున్నారు. ఏమైనా, అకస్మాత్తుగా కీలకమైన నిర్ణయం చోటు చేసుకుంటే తప్ప.. వీరి జీవితాలు కూడా అలాగే ముగుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.