: ఆ కిరాతుకుడి విడుదలను ఎలాగైనా ఆపండి: రాష్ట్రపతికి ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ
నిర్భయ (జ్యోతి సింగ్) ఘటనలో అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడి విడుదలను ఆపాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వామి మలివాల్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ మురారీ ప్రసాద్ సింగ్ కు లేఖ రాశారు. దోషులందర్లోనూ మైనర్ గా పేర్కొంటున్న వ్యక్తే అత్యంత కిరాతంగా ప్రవర్తించాడని ఆమె వివరించారు. ఈ కేసును విచారిస్తున్నప్పుడు అతను చేసిన దారుణాన్ని విని పోలీసులే చలించిపోయారని ఆమె పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని విడుదల చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. కాగా, అతని విడుదలపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి మేనకాగాంధీ కూడా అతని విడుదల సరికాదని అభిప్రాయపడ్డారు. అతడిని జైలు నుంచి విడుదల చేసిన పోలీసులు, రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు.