: నిర్భయ బాల కీచకుడి విడుదల...రహస్య ప్రాంతానికి తరలింపు
దేశ రాజధానిలో నిర్భయ (జ్యోతిసింగ్)పై అత్యాచారానికి తెగబడిన బాల కీచకుడు విడుదలయ్యాడు. 18 ఏళ్లు నిండకపోవడంతో అతనిని మూడేళ్లు జువైనల్ హోమ్ లో ఉంచిన సంగతి విదితమే. దోషి విడుదల కావడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జరిగిన దారుణం తీవ్రత దృష్ట్యా అతని విడుదలను బాధితురాలి తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రేపు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడనున్నాయని భావించిన పోలీసులు, నిర్భయ కేసులో అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఈ కుర్రాడిని విడుదల చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ కేసులో ముద్దాయిలందరికీ ఉరి శిక్ష పడగా, ఈ బాలుడు మైనర్ అయిన ఒకే ఒక్క కారణంతో కఠిన శిక్ష నుంచి తప్పించుకున్నాడు. మన దేశంలో 18 ఏళ్లు నిండిన నిందితులనే పౌర శిక్షాస్మృతి కింద విచారిస్తారు.