: ఊరు దాటకుండా మూడు దేశాల్లో నివసించిన బామ్మ


ఉన్న ఊరు దాటకుండా ఓ బామ్మ మూడు దేశాల్లో నివసించి ఔరా అనిపించింది. వివరాల్లోకి వెళ్తే...ఈ మధ్యే బంగ్లాదేశ్ తో కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ లోని రంగ్ పూర్ ప్రాంతం భారత్ లోని కూచ్ బిహార్ లో కలిసింది. ఈ ప్రాంతం భారత స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పట్లో రంగ్ పూర్ లో నివసించిన అమర్త్య బర్మన్ (95) భారత్ లోని అస్సాంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. బ్రిటిషర్లు భారత్ కు స్వాతంత్ర్యం ఇస్తూ రెండు దేశాలుగా విడగొట్టారు. దీంతో ఆమె నివసిస్తున్న రంగ్ పూర్ ప్రాంతం పాకిస్థాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె స్వాతంత్ర్యం తరువాత పాకిస్థాన్ భారతీయరాలుగా మారారు. ఆ తరువాత జరిగిన ఉద్యమాలు, ఆందోళనలతో 1971లో ఆ భూభాగం బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోయింది. దీంతో వీరంతా బంగ్లాదేశ్ భారతీయులుగా మారారు. మోదీ చొరవతో సరిహద్దు ఒప్పందం కుదరడంతో ఇప్పుడు భారతీయులుగా మారారు. దీనిపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. భారతీయురాలైన తాను తన తాత, తండ్రుల నేల అయిన పుణ్యభూమికి వచ్చేశానని భావిస్తున్నారు. అయితే ఆమె దగ్గర ఏ దేశానికి చెందిన పౌరసత్వం లేకపోవడం విశేషం. మూడు దేశాలు ఆ ప్రాంతంపై శ్రద్ధ చూపకపోవడంతో పాలకుల నిర్లక్ష్యం ఆ ప్రాంతానికి శాపంగా మారింది. ఇప్పుడు ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వనున్నప్పటికీ, ప్రభుత్వ సౌకర్యాలు చాలా ఆలస్యంగా అందనున్నాయి. దీంతో ఊరు కదలకుండానే ఆమె మూడు దేశాలు తిరిగినట్టు అయింది.

  • Loading...

More Telugu News