: విద్యార్థులకు పాఠాలు బోధించిన ఏసీబీ డైరెక్టర్ ఏకే ఖాన్


తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారారు. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పారు. ఇందుకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల వేదికైంది. టీచ్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ విద్యార్థులకు ఖాన్ పాఠాలు బోధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. ఒకప్పుడు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, విద్యార్థులతో సరదాగా ముచ్చటించడం చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News