: వాళ్లిద్దరూ జైలుకెళ్లడం ఖాయం: సుబ్రహ్మణ్యస్వామి
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు బెయిల్ వచ్చినప్పటికీ... విజయం మాత్రం తనదే అని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని... సోనియా, రాహుల్ లు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తానెప్పుడూ ప్రధాని మోదీతో చర్చించలేదని అన్నారు. ఈ కేసు ద్వారా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడటం లేదని చెప్పారు. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు సోనియా, రాహుల్ లతో పాటు మరో ముగ్గురికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.