: విలువలు, నిబద్ధతకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు: మన్మోహన్ సింగ్
విలువలు, నిబద్ధతకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. పటియాల హౌస్ న్యాయస్థానంలో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసు నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిబద్ధతతో పోరాడే పార్టీ అని ఆయన చెప్పారు. విలువలు కలిగిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఇలాంటి చర్యలు వారిని భయపెట్టలేవని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.