: అబద్ధాలు చెప్పడంలో రాహుల్ గాంధీ నిష్ణాతుడు: రవిశంకర్ ప్రసాద్
నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో రాహుల్ గాంధీ నిష్ణాతుడని అన్నారు. హైకోర్టులో అతనికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ఈ నెల 9న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ కేసు వంద శాతం ప్రధాని కార్యాలయం చేపట్టిన రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. ఈ క్రమంలోనే రాహుల్ పై రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాజకీయ నాయకుడిగా కాక, ఒక సామాన్య పౌరుడిగానే పిటిషన్ దాఖలు చేశారని రవిశంకర్ చెప్పారు.