: సోనియా, రాహుల్ కు బెయిల్ మంజూరు


నేషనల్ హెరాల్డ్ కేసులో పటియాలా హౌస్ కోర్టు ముందు హాజరైన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు మరో ముగ్గురికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, వారికి బెయిల్ మంజూరు చేయకూడదంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వాదించారు. దీంతో, చట్టాల అతిక్రమణ జరగలేదని, ఇది కేవలం రాజకీయ కోణంలో తన క్లయింట్లను వేధించేందుకు పెట్టిన కేసు అంటూ పటియాలా హౌస్ కోర్టులో గాంధీల తరఫున కపిల్ సిబాల్ న్యాయస్థానానికి తెలిపారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం చెరో 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దీంతో, సోనియా గాంధీ తరపున మాజీ కేంద్ర మంత్రి ఎ.కె. ఆంటోనీ, రాహుల్ గాంధీ తరపున ప్రియాంక గాంధీ చెరి 50 వేల రూపాయల పూచీకత్తు సమర్పించారు. దీంతో వారికి న్యాయస్ధానం షరతుల్లేని బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 2016 ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News