: త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తాం: కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 2016-17 విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కేజీ టు పీజీ విద్యా విధానం రూపకల్పన చేస్తున్నామని కడియం వివరించారు.