: బాలీవుడ్ నటి రేఖకు యశ్ చోప్రా స్మారక పురస్కారం


బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రా స్మారక అవార్డును ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న ముంబైలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో టీఎస్ఆర్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేయనుంది. సినీ రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులకు ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తున్నారు. ఇందులో భాగంగా అవార్డు గ్రహీతలకు స్వర్ణ పతకం, రూ.10 లక్షల నగదు బహుమతిని ఇస్తున్నారు. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ లు ఈ అవార్డును స్వీకరించారు. ఈసారి జ్యూరీ సభ్యులు హేమమాలిని, జయప్రద, బోనీకపూర్, సుబ్బరామిరెడ్డి... ఈ అవార్డుకు రేఖను ఎంపిక చేశారు. 61 సంవత్సరాల రేఖ 1981లో యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'సిల్ సిలా'లో నటించింది.

  • Loading...

More Telugu News