: నిరసనల మధ్యే 5 బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం


ఏపీ శాససభలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల తీవ్ర నిరసన, నినాదాల మధ్యే ప్రభుత్వం 5 బిల్లులను ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి సవరణల బిల్లు, విద్యుత్ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్ అనుమతితో సభలో ప్రవేశపెట్టింది. తరువాత సభను 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News