: రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమే?... నేటి అసెంబ్లీలో వైసీపీ అజెండా అదేనట!


నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే రోజాపై విధించిన సస్పెన్షన్ సభా నియమాలకు విరుద్ధమేనని వైసీపీ వాదిస్తోంది. ఇదే వాదనతో నేటి అసెంబ్లీ సమావేశాల్లో ముందుకు సాగాలని కూడా ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. నిన్నటిదాకా కాల్ మనీ సెక్స్ రాకెట్ పై సమగ్ర చర్చకు డిమాండ్ చేసిన వైసీపీ, రోజా సస్పెన్షన్ తో షాక్ కు గురైందనే చెప్పాలి. అంతేకాక కాల్ మనీపై చర్చ కొనసాగిస్తూనే, రోజా సస్పెన్షన్ నే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీంతో నేడు కూడా అసెంబ్లీలో రణరంగం తప్పదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News