: ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా: బుద్దా వెంకన్న


తాను, తన సోదరుడు చాలా కాలంగా ఒక ఇంట్లో నివసించడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తామిద్దరం ఒకే ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తన సోదరుడు సెక్స్ రాకెట్ లో అరెస్టు కాలేదని, అయినా తన సోదరుడికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని ఆయన చెప్పారు. తన సోదరుడి దగ్గర ప్రాంసరీ నోట్లు లభ్యం కావడం వల్లే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయాలని జగన్ ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. తనకు వైఎస్సార్సీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News