: నిరసన తెలిపేందుకు కూడా రోజాకు అవకాశమివ్వలేదు: వైఎస్ జగన్
అసెంబ్లీలో నిరసన తెలిపేందుకు కూడా నగరి ఎమ్మెల్యే రోజాకు అవకాశమివ్వలేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్ కొడితే మహిళలను కాపాడతామని టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు కానీ, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. అందుకు ఉదాహరణ కాల్ మనీ కేసులో మహిళలేనని అన్నారు. మహిళలు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సినంత దారుణ పరిస్థితి ఎందుకొచ్చిందో ప్రభుత్వం తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ ఆగడాలు రెండు నెలల కిందటే సీఎం దృష్టికి వచ్చాయని, బోడే ప్రసాద్ తో కలిసి బ్యాంకాక్ లో తిరిగిన వెనిగళ్ల శ్రీకాంత్ ఇప్పుడు ఏమయ్యాడంటూ జగన్ ప్రశ్నించారు.