: కొడుకు హెయిర్ స్టైల్ నచ్చలేదని కుటుంబాన్ని అంతం చేసేశాడు!
కొడుకు హెయిర్ స్టైల్ నచ్చలేదన్న స్వల్ప కారణంతో భార్యతో వాదులాడి, చివరికి తన మొత్తం కుటుంబాన్ని అంతం చేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం యావజ్జీవ జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ సంఘటన కొన్నాళ్ల క్రితం రష్యాలో చోటుచేసుకుంది. ఒలెగ్ బొలెవ్ అనే వ్యక్తి తన భార్య, ఆరుగురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆయన భార్య తన ఆరేళ్ల కుమారుడుకి కాస్త వెరైటీగా హెయిర్ కట్ చేయించింది. అది ఒలెగ్ కు నచ్చలేదు. దీనిపై ఆయన తన భార్యతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దాంతో ఒలెగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య విడాకులిస్తానని హెచ్చరించింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఒలెగ్ తన పిల్లలు చూస్తుండగా నిండు గర్భిణి అయిన ఆమెను నరికి చంపాడు. అనంతరం తన ఆరుగురు పిల్లలను నరికి చంపేశాడు. అక్కడి నుంచి నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్లిన ఒలెగ్ ఆమెను కూడా నరికి చంపాడు. అనంతరం నేరుగా న్యాయస్ధానానికి వెళ్లి, జరిగినది వివరించాడు. దీంతో అతనికి న్యాయమూర్తి యావజ్జీవకారాగార శిక్ష విధించారు.