: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి... స్వాగతం పలికిన గవర్నర్, కేసీఆర్
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. హకీం పేట ఎయిర్ బేస్ లో ప్రత్యేక విమానంలో దిగిన రాష్ట్రపతికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రణబ్ కు కేసీఆర్ పాదాభివందనం చేశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్, మండలి డిప్యూటీ స్పీకర్, పలువురు అధికారులు కూడా రాష్ట్రపతితో కరచాలనం చేశారు. నేటి నుంచి ఈ నెల చివరి వరకు అంటే 14 రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ లోనే విడిది చేయనున్నారు.