: జగన్ వల్ల మాకు మెంటలెక్కుతోంది: యనమల
కాల్ మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చ జరుపుదామని ఇంతకు ముందే తాము చెప్పామని... చెప్పిన విధంగా ప్రతిపక్ష సభ్యులను మాట్లాడమంటున్నామని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత దానిపై చర్చించాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయించవచ్చని... అయినా తాము మాత్రం ఈ అంశంపై మాట్లాడమనే చెబుతున్నామని చెప్పారు. అయినప్పటికీ జగన్ మాట్లాడకుండా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యవహారశైలితో తమకు మెంటలెక్కుతోందని అన్నారు.