: జగన్ సైకోగాడు: అచ్చెన్నాయుడు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ సైకోగాడని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఓ ఫోటోను పట్టుకుని లేని పోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్ సిగ్గుమాలినతనం చూడలేకపోతున్నానని అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్ధాయి ఎవరికీ లేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నేరం వెనుక జగన్ హస్తం ఉందని, లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ మాటలు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.