: ముద్దాయిలంతా ఇక్కడే ఉన్నారు... అయినా అరెస్ట్ చేయలేదు: జగన్
కాల్ మనీకి సంబంధించి ముఖ్యమంత్రి తన ప్రకటనను తాను చదువుకుంటూ వెళ్లిపోయారని... పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాటించకుండా సభను నిర్వహించారని ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. ఇలాంటి దారుణమైన శాసనసభను తాను ఇంతవరకు చూడలేదని చెప్పారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది సభ్యుల హక్కు అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కౌరవసభను నిర్వహిస్తుంటే... ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకు వస్తాయని అసహనం వ్యక్తం చేశారు. కాల్ మనీ కేసులోని ముద్దాయిలు, నిందితులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోనే ఉన్నారని... అయినా వారిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ సంబంధింత ఫొటోలను శాసనసభలో ప్రదర్శించారు.