: మీ ఓపికకు జోహార్లు సార్!: స్పీకర్ కు విష్ణుకుమార్ రాజు కితాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓపికకు జోహార్లు అని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలను వారివారి స్థానాలలో కూర్చోబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు జోహార్లు అని అన్నారు. ఇంత ఓపికగా ఉండడం ఎవరివల్లా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంత ఓపికగా చెబుతున్నా వైఎస్సార్సీపీ నేతలు వినడం లేదంటే వారిని ఏమనుకోవాలో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత కూడా వారిని వారించడం లేదని ఆయన విమర్శించారు. దీంతో జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలు పోడియం నుంచి వెనక్కి వెళ్లి వారివారి స్థానాల్లో కూర్చున్నారు.