: మీరు డౌన్ డౌన్ అంటే, నేను డౌన్ అవుతానా?: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
ఏపీ శాసనసభ అట్టుడుకుతోంది. కాల్ మనీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తుండగా... వైకాపా సభ్యులు అడ్డుకునేందుకు యత్నించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు పట్టుబట్టారు. 'చంద్రబాబు డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు సైతం యత్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వైకాపా సభ్యులు రౌడీలు, గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపైనే దాడి చేయాలనుకుంటారా? అంటూ కన్నెర్ర చేశారు. మీ వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని... మీకు మళ్లీ బుద్ధి చెబుతారని అన్నారు. డౌన్ డౌన్ అంటే తాను డౌన్ కానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మీరు ముందు రూల్స్ తెలుసుకోవాలని సూచించారు.