: ముంబయి వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదీ మృతి!


ముంబయి వరుస పేలుళ్ల కేసులో ప్రధాన దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ గపూర్ పార్కర్ (80) అనారోగ్యం కారణంగా గురువారం మృతి చెందాడు. ఈ విషయాన్ని నాసిక్ రోడ్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రమేష్ కాంబెల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవిత ఖైదీగా ఈ జైలులో ఉన్న పార్కర్ అనారోగ్యం కారణంగా నాసిక్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కాగా, 1993లో ముంబయిలో వరుస పేలుళ్ల సంఘటన జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్కర్ 2013లో ముంబయిలోని టాడా కోర్టు ఎదుట లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News