: పట్టుబడ్డ బంగారంలో అవకతవకలు... చెన్నై ఎయిర్ పోర్టులో సీబీఐ దాడులు


చెన్నైలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు నేడు దాడులు నిర్వహించారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారం విషయమై లెక్కల్లో అవకతవకలు ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై ఈ సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇంటర్నేషనల్ విమానాలు వచ్చి పోయే ప్రాంతాలలోను, అక్కడి సిబ్బంది ఆఫీసు రూములలోను అధికారులు సోదాలు జరిపి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News