: ఆస్ట్రేలియా ప్రధానికి స్వాగతం చెప్పిన జపాన్ రోబో!
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బుల్ కు జపాన్ లో ఊహించని విధంగా అరుదైన స్వాగతం లభించింది. ఆ దేశంలోని జాతీయ ప్రదర్శన శాలకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి రోబో ఆహ్వానం పలికి స్వాగతించింది. రోబో తనను తాను పరిచయం చేసుకుని, టర్న్ బుల్ ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా ముగ్ధుడైన టర్న్ బుల్ రోబోతో కరచాలనం చేసి, సెల్ఫీ తీసుకున్నారు.