: బాజీ, మస్తానీ రొమాన్స్ కు పాక్ సెన్సార్ చెక్


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన మరో కళాఖండం 'బాజీరావ్ మస్తానీ' సినిమాకు పాకిస్థాన్ సెన్సార్ బోర్డు చెక్ చెప్పింది. పాక్ లో సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇవ్వలేదు. పీష్వా బాజీరావ్ గా పేరుగాంచిన బాజీరావ్ బల్లాల భట్ జీవితంలోని ప్రేమకథే ఈ చిత్రం. హిందూ వీరుడైన బాజీరావ్ తన పెళ్లైన తర్వాత తన జీవితంలో ప్రవేశించిన మస్తానీ అనే ముస్లిం యువతి ప్రేమలో పడతాడు. ఈ కథనంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బాజీరావ్, మస్తానీల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. హిందూ రాజు, ముస్లిం యువతిల మధ్య ప్రేమ సన్నివేశాలు అక్కడ వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని బోర్డు సభ్యులు భావిస్తున్నారు. ఈ కారణంగానే పాక్ సెన్సార్ బోర్డు ఈ సినిమాకి క్లియరెన్స్ ఇవ్వలేదు. ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా సినిమా ఉందని బోర్డు తెలిపింది. అయితే పాక్ లోని స్థానిక డిస్ట్రిబ్యూటర్లు మాత్రం మరోసారి సినిమాను సమీక్షించాలని సెన్సార్ బోర్డును కోరారు.

  • Loading...

More Telugu News