: కన్నడ నాట భారీ అణ్వస్త్ర కేంద్రం!...భారత్ రహస్యంగా నిర్మిస్తోందంటూ ‘ఫారిన్ పాలసీ’ కథనం


పోఖ్రాన్ లో అణు పరీక్షలతో గతంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయిలు ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. మౌన మునిలా కనిపించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వారి బాటలోనే కీలక అడుగేశారు. పోఖ్రాన్ ను మించి కర్ణాటకలో భారీ అణ్వస్త్ర కేంద్రం నిర్మాణానికి ఆయన నేతృత్వంలోని యూపీఏ-2 సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కర్ణాటకలోని చెల్లకేరేలోని ఓ ప్రాంతంలో అణ్వాయుధాల తయారీ, ప్రయోగ శాల, వైమానిక ప్రయోగాలకు సంబంధించిన కేంద్రం తదితరాల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ఈ నిర్మాణాలన్నీ మరో రెండేళ్లలో (2017 నాటికి) పూర్తవుతాయి. ఈ పనులన్నీ పూర్తయితే భారత ఉపఖండంలోనే ఈ అణ్వస్త్ర కేంద్రం అతి పెద్దదిగా వినుతికెక్కనుంది. ఈ మేరకు అంతర్జాతీయ మేగజీన్ ‘ఫారిన్ పాలసీ’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది.

  • Loading...

More Telugu News