: ఆ బార్బీ బొమ్మను చూసి జనం భయపడుతున్నారట!


చూడడానికి ఆమె అచ్చం బార్బీ బొమ్మల్లే ఉంటుంది, కానీ పొరపాటున ఆమె వీధిలోకి వచ్చిందంటే చాలు, ఆమెను చూసి జనం పారిపోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే, బార్బీ బొమ్మలా కనపడాలనే కోరికతో పాశ్చాత్య దేశాల్లోని మోడల్స్ కడుపులు మాడ్చుకుని, సర్జరీలు చేయించుకుంటున్నారు. అలాంటివేవీ లేకుండానే, బ్రెజిల్ కు చెందిన ఆండ్రెస్సా దామియాని సహజంగానే బార్బీ బొమ్మలా ఉంటుంది. కేవలం 20 అంగుళాల నడుం, 32 చెస్ట్ తో ఆమె బార్బీ బొమ్మను తలపిస్తుంది. అంత అందంగా ఉన్న దామియానికి యూట్యూబ్ లో ఆరు లక్షల మంది, ఇన్ స్టా గ్రాంలో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంత మందిని ఆకట్టుకున్న దామియాని స్వస్థలం బ్లూమెనావులోని వీధిలోకి వెళ్లిందంటే చాలు పిచ్చిదంటూ జనం పారిపోతున్నారు. దీనిపై మండిపడుతున్న దామియాని తాను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నానని, బార్బీ బొమ్మలా కనిపించేందుకు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదని, కనీసం డైటింగ్ కూడా చేయనని చెబుతోంది. తన బంధువులు అంతా చిన్నప్పటి నుంచి తనను చూసి, 'బార్బీ బొమ్మ' అంటుంటే ఆగ్రహం ముంచుకొచ్చేదని, 20 ఏళ్లు వచ్చాక బార్బీ బొమ్మ అంటుంటే ఆనందంగా ఉంటోందని తెలిపింది. తాను అచ్చం బార్బీ బొమ్మలా కనిపించేందుకు కాంటాక్ట్ లెన్స్, నల్లటి ఐ లైనర్ మాత్రమే వాడతానని, మిగిలినదంతా తన ఒరిజనల్ అందమేనని స్పష్టం చేస్తోంది. ఎక్కువగా పింక్ కలర్ దుస్తులు ధరిస్తానని దామియాని వెల్లడించింది. ఎల్సా స్టైల్ మేకప్ పేరుతో యూట్యూబ్ లో బ్యూటీ పాఠాలు చెబుతోంది.

  • Loading...

More Telugu News