: 'ఆమ్ ఆద్మీ పార్టీ' విదేశీ నిధులపై విచారణకు ఢిల్లీ హైకోర్టు 'నో'


ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమ మార్గాల్లో విదేశాల నుంచి నిధులు సమకూరుతున్నాయని, వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిల్ వేశారు. ఆప్ లో ఉన్న ముస్లిం నేతలకు దుబాయ్ వంటి దేశాల నుంచి లక్షల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయని, అవి నిధులు సమకూర్చేందుకేనని ఆయన పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం విచారణకు తిరస్కరించింది. గత ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టిందని, అప్పుడు ఇలాంటి ఆరోపణలు చేసినప్పటికీ, నిధులు అక్రమమైనవని ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని, అదే సమయంలో ఆప్ తన నిధులకు లెక్కలు చెప్పగలిగిందని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఈ పిల్ ను విచారణకు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News