: ఆంధ్ర జట్టు ప్రదర్శన అత్యంత ఘోరం
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో ఓటమిపాలైంది. ఆంధ్ర జట్టు రెండంకెల స్కోరు దాటేందుకు నానా కష్టాలు పడిందంటే ఆ జట్టు ఆటతీరును అంచనా వేయవచ్చు. విదర్భతో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ ప్రశాంత్ (38) రాణించడంతో ఆంధ్ర జట్టు కేవలం 25.3 ఓవర్లు మాత్రమే ఆడి 87 పరుగులు చేసింది. అల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విదర్భ వికెట్ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్ లలో ఓడి, రెండింట నెగ్గిన ఆంధ్ర పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరగా, విదర్భ జట్టు 16 పాయింట్లతో గ్రూప్ సీలో అగ్రస్థానం కైవసం చేసుకుంది.