: హైదరాబాద్ కు మరిన్ని నిధులు ఇవ్వండి... వెంకయ్యకు సీఎం కేసీఆర్ లేఖ


ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆయనకు కేసీఆర్ లేఖ రాశారు. స్మార్ట్ సిటీ పథకంలో చేర్చిన హైదరాబాద్ కు కేవలం రూ.100 కోట్లతో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని తెలిపారు. రూ.5,500 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్ఎంసీకి సంవత్సరానికి కేవలం రూ.వంద కోట్లు ఇస్తే ఏ పనులూ చేపట్టలేమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అవసరాలు గుర్తించి మరిన్ని నిధులు మంజూరు చేయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక నగరాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని విన్నవించారు. ఇక 625 కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన హైదరాబాద్ ఏ-1 కేటగిరిలో ఉందని, దాని స్థానంలో కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని తెలిపారు.

  • Loading...

More Telugu News