: జెట్ ఎయిర్ వేస్ సీఈవో రాజీనామా...డైరెక్టరే సీఈవో!
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ సీఈవో క్రేమర్ బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో బాటు, యూరోప్ లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు రాజీనామా చేస్తున్నట్టు ఆయన సంస్థకు తెలిపారు. కాగా, ఆయన రాజీనామాను ధ్రువీకరించిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ 2016 ఫిబ్రవరి వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారని తెలిపింది. జెట్ ఎయిర్ వేస్ లో హోల్ టైం డైరెక్టర్ గా ఉన్న గౌరంగ్ శెట్టి యాక్టింగ్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించనున్నారని ఆ సంస్థ తెలిపింది. విమానయాన రంగంలో 35 ఏళ్ల అనుభవం ఉన్న గౌరంగ్ శెట్టి గత 19 ఏళ్లుగా జెట్ ఎయిర్ వేస్ లో కొనసాగుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది.