: స్పెయిన్ ప్రధాని చెంప పగులగొట్టిన టీనేజర్
టీనేజ్ యువకుడు స్పెయిన్ ప్రధాని చెంప పగులగొట్టడం సంచలనం సృష్టించింది. ప్రధాని మారియానో రజోయ్ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని ప్రణాళికలు ప్రజలకు వివరిస్తుండగా అక్కడే ఉన్న 17 ఏళ్లు యువకుడు ఆయన ముఖంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆయన కళ్లకు ఉన్న కళ్ల జోడు ఎగిరిపడింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు. దీంతో రంగ ప్రవేశం చేసిన భద్రతా సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.