: గూగుల్ నాకో మిఠాయి కొట్టులా కనిపించేది: సుందర్
తాను తొలిసారిగా గూగుల్ లో అడుగుపెట్టిన వేళ, చిన్నపిల్లాడు ఓ మిఠాయి కొట్టుకు వెళ్లినంత సంబరపడ్డానని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వివరించారు. తన మనసులో ఏం ఆలోచనలు ఉండేవో, వాటిని నెరవేర్చుకునేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులూ అక్కడ తనకు దగ్గరయ్యానని అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో సమావేశమైన ఆయన విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 1980వ దశకంలో మద్రాసులో తాను పెరిగానని, ఓ టెస్టు మ్యాచ్ కూడా చూశానని తెలిపాడు. ఫుట్ బాల్, క్రికెట్ పోటీలను చూస్తానని తెలిపారు. టీ-20 పోటీలంటే మాత్రం ఆసక్తి లేదని అన్నారు. ఇండియా అంటే తనకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని, గూగుల్ సంస్థ అద్భుతాలకు కేంద్రమని, భవిష్యత్తులో మరిన్ని టెక్ అద్భుతాలను ప్రపంచం ముందు ఉంచుతామని అన్నారు.