: ఇంటర్వ్యూ వేళ టెక్ ఇంజనీర్లు సమాధానాలు వెతుక్కునే ప్రశ్నలివి!


టెక్నాలజీ విభాగంలో పనిచేసే ఇంజనీర్లు మిగతావారితో పోలిస్తే స్మార్ట్ గా ఉంటారని, ఆలోచిస్తారని చెబుతుంటారు. ఇక టెక్ ఇంజనీర్లను ఇంటర్వ్యూలు చేసి లక్షలాది వేతనాలు ఆఫర్ చేసే ఉన్నతోద్యోగులు ఎలా ఉంటారో, ఏం ప్రశ్నలు అడుగుతారో ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చిన వారికి తెలిసే ఉంటుంది. ఎంత తెలివితేటలున్నా, ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగార్థులకు ఎదురైన లాజికల్ ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇవి. 1. మీ దగ్గర రెండు బల్బులున్నాయి. 100 అంతస్తుల భవంతి ఎక్కి ఏ ఫ్లోర్ నుంచి బల్బ్ కిందపడేస్తే పగులుతుందో అతి తక్కువ సార్లు ప్రయత్నించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? (ఫేస్ బుక్ లో అడిగిన ప్రశ్న) ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానం చెప్పవచ్చు. ఆప్షన్ 1: గరిష్ఠంగా 19 సార్లు. ఎలాగంటే, ఓ పది ఫ్లోర్లు ఎక్కి ఒక బల్బ్ పడేయాలి. అది పగిలితే కిందకు వచ్చి ఒకటి నుంచి తొమ్మిదో ఫ్లోర్ వరకూ రెండో బల్బ్ వేస్తూ, వెళితే సమాధానం వస్తుంది. ఇక్కడ గరిష్ఠంగా 10 కిందపడేయాల్సి రావచ్చు. ఇక 10వ ఫ్లోర్ లో బల్బ్ పగలకుంటే 20వ ఫ్లోర్ కు వెళ్లాలి. అక్కడి నుంచి వేసినప్పుడు పగిలితే, 11 నుంచి 19 ఫ్లోర్లు చూడవచ్చు. ఇలా వెళితే అత్యధికంగా 19 సార్లు బల్బును పడేసేలోగా సమాధానం తెలుస్తుంది. ఇది అత్యధికులకు తట్టే ఆలోచన. ఆప్షన్ 2: 16 సార్లు అవకాశాన్ని వాడుకుని కూడా సమాధానం తెలుసుకునే పద్ధతి బెస్ట్ ఆన్సర్ గా నిలుస్తుంది. 16వ ఫ్లోర్ నుంచి బల్బ్ పడేస్తే పగిలిందని అనుకోండి, అప్పుడు తిరిగి కిందకు వచ్చి రెండో బల్బ్ తో 1 నుంచి 15 ఫ్లోర్లు ప్రయత్నించవచ్చు. ఒకవేళ 16వ ఫ్లోర్ లో బల్బ్ పగలకుంటే, ఆపై 31వ ఫ్లోర్ కు వెళ్లాలి. అక్కడ బల్బ్ పగిలితే, 17 నుంచి 30 ఫ్లోర్లు ప్రయత్నించాలి. బల్బ్ పగలకుంటే, ఆపై 48, 58, 70, 81, 91, 100 ఫ్లోర్ల నుంచి ప్రయత్నించాలి. ఏ ఫ్లోర్ నుంచి ప్రయత్నించినా గరిష్ఠంగా 16 సార్లలో సమాధానం పొందవచ్చు. 2. ఓ టోర్నమెంటులో 5,623 మంది పాల్గొంటున్నారు. ఎన్ని గేమ్ లు పెడితే విజేత బయటకు వస్తాడు? (అమేజాన్ లో మేనేజర్ ఉద్యోగార్థికి ఎదురైన ప్రశ్న) దీనికీ రెండు సమాధానాలు ఉన్నాయి. ఆప్షన్ 1: వాస్తవానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇంటర్వ్యూ చేసే ఉన్నతోద్యోగి కోరుకోవడం లేదు. మీ స్పాంటేనియస్ కు ఇది పరీక్ష. ఇటువంటి ప్రశ్నల్లో సమాధానాన్ని వెతకకుండా, అది టీమ్ ల మధ్య జరుగుతున్న పోటీయా? లేదా వ్యక్తుల మధ్య జరుగుతున్నదా? గ్రూపులుగా విడగొట్టిన పోటీయా? ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుందా? వంటి ప్రశ్నలను సంధిస్తే, ఆటోమేటిక్ గా తదుపరి ప్రశ్నకు వెళ్లిపోతారు. ఆప్షన్ 2: ఎంత మంది పాల్గొన్నా విజేతను నిర్ణయించేది ఒకటే పోటీ. ఎందుకంటే విజేతను నిర్ణయించే పోటీ జరిగే సమయానికి 5,621 మంది వెనక్కెళ్లి పోయి, ఇద్దరే మిగులుతారు కాబట్టి. 3. చీకటిగా ఉంది. ఓ డ్రయర్ లో 20 సాక్సులు ఉన్నాయి. ఓ మ్యాచింగ్ పెయిర్ తీసుకోవాలంటే ఎన్నిసార్లు ప్రయత్నించాలి? (వెబ్ ట్రెండ్స్ లో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ కు ఎదురైన ప్రశ్న) సమాధానం: రెండు సాక్సులో, మూడు సాక్సులో తీసుకుని అవి సరిగ్గా ఉన్నాయా? లేవా? అన్నది చూస్తూ సమయం వృథా చేసే ఆలోచన లేదు. ఒకేసారి 11 సాక్సులు తీసుకుంటా. అందులో ఓ జత తప్పనిసరిగా ఉంటుంది. 4. నలు చదరంగా ఉన్న గదిలో మీరున్నారు. దానికి పైకప్పు లేదు. మీ వద్ద నాలుగు జెండాకర్రలు ఉన్నాయి. వాటిని గోడలపై అమర్చుతూ, ప్రతి కర్రా రెండు గోడలను తాకేలా ఎలా అమర్చాలి? (సిస్కోలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఎదురైన ప్రశ్న) సమాధానం: వాటిని కార్నర్లలో అమర్చాలి. ప్రతి మూలా రెండు గోడలు ఉన్నట్టే కాబట్టి. 5. మీ వద్ద 9 బంతులున్నాయి. వాటిల్లో ఒక బంతి బరువు మిగతా వాటితో సమానం కాదు. తక్కెడలో ఎన్ని తక్కువ సార్లు ప్రయత్నించి వ్యత్యాసం గల బరువున్న బాల్ ను కనుగొనవచ్చు? (డీఈ షా అండ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఎదురైన ప్రశ్న) సమాధానం: కనీసం రెండు సార్లలో కనుగొనవచ్చు. ఎలాగంటే, మూడు మూడు బాల్స్ చొప్పున తక్కెడలో ఇరువైపులా ఉంచాలి. అవి సమానంగా ఉంటే, మిగతా మూడు బాల్స్ లోని రెండింటిని చెరోవైపు ఉంచితే, బరువు తేడాగా ఉన్న బంతి తెలిసిపోతుంది. ఇక తొలుత మూడు బంతులు ఉంచినప్పుడు ఓ వైపు తక్కెడ మొగ్గు చూపితే, అందులోని బంతుల్లో రెండింటిని అటూ ఇటూ ఉంచి సమాధానం తెలుసుకోవచ్చు. 6. మీ దగ్గర రెండు తాళ్లు ఉన్నాయి. వాటికి నిప్పంటిస్తే, ఒకవైపు నుంచి మరో వైపుకు బర్న్ కావడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. మీ దగ్గర ఒకే అగ్గిపుల్ల ఉంది. దాన్ని వినియోగించి ఈ రెండింటినీ 45 నిమిషాల్లో ఎలా మసి చేయవచ్చు? (జోరాన్ లో ఏఎస్ఐసీ వెరిఫికేషన్ ఇంజనీర్ కు ఎదురైన ప్రశ్న) సమాధానం: ముందుగా ఓ రోప్ ను గుండ్రంగా ఉంచాలి. దానికి ఎక్కడ నిప్పంటించినా, 15 నిమిషాల్లో కాలిపోతుంది. (మంట రెండు వైపులా వెళుతుంది కాబట్టి). సరిగ్గా 15 నిమిషాల తరువాత మొదటి రోప్ ఆరిపోయే వేళ రెండో దానికి ఓ వైపున నిప్పును అంటించగలిగితే, అది 30 నిమిషాలు మండుతుంది. 7. మీ ముందు మూడు స్విచ్ లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కింద అంతస్తులో ఉన్న బల్బుకు సంబంధించినది. అక్కడ బల్బు వెలిగినా ఆ కాంతి మీకు కనిపించదు. ఏ స్విచ్ వేస్తే బల్బు వెలుగుతుందో ఎలా చెప్పవచ్చు? మీకు ఒక్కసారి మాత్రమే కిందకు వెళ్లి చూసే అవకాశం ఉంది.. (రేథియాన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అడిగిన ప్రశ్న) సమాధానం: మీకు తోచిన స్విచ్ వేయండి. ఓ 10 నిమిషాల పాటు ఆగాలి. ఆపై దాన్ని ఆఫ్ చేసి, రెండవ స్విచ్ వేసి కిందకు వెళ్లాలి. లైట్ ను పరిశీలించాలి. ఒకవేళ అది వేడిగా ఉంటే, వేసిన స్విచ్ ఆ బల్బుదే. ఒకవేళ బల్బ్ వెలిగివుంటే రెండవ సారి వేసిన స్విచ్ ఆ బల్బుదేనని తెలుస్తుంది. ఒకవేళ బల్బు ఆగిపోయి, చల్లగా ఉంటే ప్రయత్నించిన రెండు స్విచ్ లూ తప్పని, మూడవది సరైన స్విచ్ అని తెలుస్తుంది. ఇలా ట్రిక్కీగా లాజిక్ తో నిండిన ప్రశ్నలెన్నో ఇంజనీరింగ్ ఉద్యోగార్థులకు ఎదురవుతుంటాయి.

  • Loading...

More Telugu News