: ప్రతిపక్ష సభ్యులు సభా సంప్రదాయాలు తెలుసుకోవాలి: మంత్రి యనమల


ఏపీ శాసనసభలో గందరగోళం కొనసాగుతోంది. కాల్ మనీ వ్యవహారంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియ వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, కాల్ మనీపై రేపు చర్చకు సిద్ధమని తెలిపారు. 11 చార్జి షీట్ లున్న వ్యక్తి ఈ సభలో ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టమని విమర్శించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి చరిత్ర, చట్టాలు, రాజ్యాంగం తెలియవని ఎద్దేవా చేశారు. కేవలం సభను అడ్డుకోవాలన్న విషయం మాత్రమే ఆయనకి తెలుసునన్నారు. దయచేసి ప్రతిపక్షనేత, సభ్యులు ఇకనైనా సభా సంప్రదాయాలు తెలుసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News